హైదరాబాద్ లోని అత్తాపూర్లో ఓ అత్త చాయ్ పెట్టనందుకు క్షణికావేశంలో కోడలిని చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ లోని హసన్ నగర్ ప్రాంతంలో ఫర్జానా అనే మహిళ గురువారం ఉదయం 9.30 గంటలకు చాయ్ పెట్టి ఇవ్వాలని తన కోడలు అజ్మీర బేగం (28) కి చెప్పింది. అప్పటికే ఏదో పనిలో ఉన్న ఆమె అందుకు నిరాకరించింది.
దీంతో ఫర్జానా చున్నీతో కోడలు మెడకు బిగించి ఉరివేసిచంపేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.