ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు లోని రెండోపట్టణంలోని గాంధీనగర్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రహిద్ అనే యువకుడి హత్య నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.. ఈ సందర్భంలో మృతుడి బంధువులు పోలిస్టేషన్ ముందు బైటాయించి ఆందోళన చేపట్టారు.. నిందితులను చూపించి ఎందుకు మా బిడ్డను చంపారో మాకు చెప్పాలని పోలీసులతో వాదనకు దిగడంతో పోలీసులు వారితో చర్చించి విచారణ చేస్తున్నామని ఇద్దరు యువకులు, ఒక యువతిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ఉన్నామని చెప్పడంతో వారు అక్కడ నుండి వెళ్లిపోయారు.....పోలీసులు నిందితులను విచారణ చేపడుతున్నారు....పోలీసులు చెపుతున్న సమాచారం ప్రకారం వివాహేతర సంభందమే కారణమని తెలియవస్తుంది.... మృతుడు, నిందితులు నిన్న రాత్రి కలిసి మందు త్రాగుతున్న సమయంలో గొడవ కూడా జరిగిందని చూసిన వారు పోలీసులకు తెలపడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకన్నారు......నిందితుల్లో ఒకరు వెంకీ అనే యువకుడు కత్తులతో హల్చల్ చేస్తున్నట్లు వీడియోస్ చేసి ఇంస్టాగ్రామ్ లో కూడా పోస్టులుపెడుతూ వందన అనే వివాహిత మహిళతో అక్రమ సంభందం పెట్టుకుని ఆమెతోనే ఉంటూ ఆమెతో ఎవరు మాట్లాడిన వారిని బెదిరిస్తూ ఉండటమే ఇతని నైజం అని అక్కడి ప్రజలు కూడా చెపుతున్నారు....వందన అనే మహిళా ఎన్టీఆర్ అపార్ట్మెంట్ లో కొంతమంది యువకులను చేరదిస్తూ ఒక ముఠా లాగా తయారు చేసి వారికి వెంకీని లీడర్ అని చెపుతూ ఒక గ్రూపుని తయారుచేసి వ్యభిచారం నడుపుతుందని పోలీసుల విచారణలో తెలియడంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.