Hyderabad Crime Update : పుప్పాలగూడ ప్రేమ జంట హత్య కేసులో వీడిన మిస్టరీ
నార్సింగి పుప్పాలగూడ పరిధిలో జంట హత్యల కేసును పోలీసులు చేదించారు. జంట హత్యలు చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ హత్య చేసిన నిందితుడు మధ్యప్రదేశ్ పారిపోయాడు. అక్రమ సంబంధం కారణంగానే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. చనిపోయిన మహిళ అక్రమ సంబంధాన్ని కొనసాగించడాన్ని నిందితుడు జీర్ణించుకోలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. ఏకాంతంగా ఉన్న సమయంలో వెంటాడి వేటాడి ఇద్దరినీ దారుణంగా నిందితుడు చంపినట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో నిందితుడిని హైదరాబాద్‌కి తీసుకురానున్నట్లు పోలీసులు వెళ్లడించారు.