నల్గొండ జిల్లా డీఈవో భిక్షపతి అడ్డంగా బుక్కయ్యారు. భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ దొరికిపోయారు. మరో మహిళతో డీఈవో భిక్షపతి సన్నిహితంగా ఉన్న టైంలో అతడి భార్య పట్టుకుంది. కొంతకాలంగా కోర్టులో భిక్షపతి దంపతుల వివాదం నడుస్తోంది. భార్యకు విడాకులు ఇవ్వకుండానే ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా డీఈవో భిక్షపతి ఉన్నాడు. మహిళా ఉపాధ్యాయులపై లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తనకు లొంగకుంటే వేధింపులకు గురిచేసి సస్పెండ్ చేస్తారని.. భిక్షపతి పై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. రాజకీయ పలుకుబడితో నల్గొండలో ఏళ్లుగా భిక్షపతి తిష్టవేసినట్లు చెబుతున్నారు. భిక్షపతి వ్యవహారంపై మహిళా సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.