బాలయ్య పేరుతో విరాళాల సేకరణ.. స్పందించిన నటసింహం..

Update: 2025-07-30 11:45 GMT

సెలబ్రిటీల పేరు చెప్పి మోసాలకు పాల్పడడం ఎన్నో ఏళ్లుగా జరుగుతూనే ఉంది. తాజాగా నందమూరి బాలకృష్ణ పేరుతో ఓ వ్యక్తి ఇలాంటి ఘటనకే తెరదీశాడు. దీంతో బాలయ్య స్పందించాడు. తనతో పాటు తన ఆస్పత్రికి అధికారికంగా ఎటువంటి విరాళాలు చేపట్టడం లేదని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘‘బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్” పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఆస్పత్రి తరఫున ఏదైన ఉంటే అధికారికంగా ప్రకటిస్తాం. ఈ ఈవెంట్‌కు నా పర్మిషన్ లేదు. ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు ఆమోదం కూడా లేదు. దయచేసి ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాలలు కేవలం పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహిస్తాం’’ అని బాలయ్య తెలిపారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ప్రస్తుతం బాలయ్య అఖండ 2తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో ఆదిపినిశెట్టి విలన్‌గా నటిస్తుండగా, ఇటీవల విడుదలైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Tags:    

Similar News