Sidhu Moose Wala: సింగర్ సిద్దూ మూసేవాలా మర్డర్ కేసులో షూటర్ అరెస్ట్..
Sidhu Moose Wala: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా మర్డర్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.;
Sidhu Moose Wala: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా మర్డర్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరో షూటర్ అంకిత్ సిర్సాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి కత్తి, 2 తుపాకులు, సిమ్ కార్డ్, రెండు మొబైల్ ఫోన్లును స్వాధీనం చేసుకున్నారు. షూటర్ అంకిత్ అరెస్టుతో ఇప్పటివరకు మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, సచిన్ బివానీని అరెస్టు చేశారు. అంకిత్ సిర్సాపై రాజస్తాన్‌లో రెండు హత్య కేసులు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మే 29న సింగర్ సిద్దూ మూసేవాలాను బిష్ణోయ్ గ్యాంగ్ అతి కిరాతకంగా చంపడం అప్పట్లో సంచలనం రేపింది.