మహిళా టిక్‌టాకర్‌పై 300 మంది దాడి.. గాల్లోకి ఎగరేస్తూ..
Pakistan: పాకిస్థాన్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. ఒక యువతితో వందలమంది అసభ్యంగా ప్రవర్తించారు.;
పాకిస్థాన్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. ఒక యువతితో వందలమంది అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె దుస్తులను చించేసి.. ఎత్తుకొని గాల్లోకి ఎగరేస్తూ రాక్షస ఆనందం పొందారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని లాహోర్‌లో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకుంది. తాజాగా ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఓ అమ్మాయి సరదాగా వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఆగస్టు 14న తన స్నేహితులతో కలిసి వీడియో చిత్రించడానికి గ్రేటర్ ఇక్బాల్ పార్క్ వద్దకు వెళ్లింది. అక్కడికి 300కు పైగా మంది వచ్చారు. అమ్మాయి ఉన్న ప్రదేశానికి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమె దుస్తులను పట్టుకొని లాగారు. అంతేకాకుండా ఆమెను ఎత్తుకొని గాల్లోకి ఎగరేశారు. అల్లరి మూక నుంచి తప్పించుకోవడానికి ఆమె చాలా ప్రయత్నం చేసింది.
అంత మంది మధ్యలో నుంచి తప్పించుకోలేక విలవిలలాడింది. ఇదంతా గమనించిన అక్కడి సెక్యూరిటీ గార్డు ఆ అమ్మాయిని వారి చెర నుంచి విడిపించారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.