Hyderabad : కాలు సర్జరీ చేస్తుండగా పేషెంట్ మృతి.. ఆస్పత్రి ముందు కుటుంబసభ్యుల ఆందోళన..
Hyderabad : హైదరాబాద్ హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది.;
Hyderabad : హైదరాబాద్ హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. యాక్సిడెంట్‌లో కాలు విరిగిందని సర్జరీ చేస్తున్న వ్యక్తి.. చనిపోవడంతో బాధితుడి బంధువులు ఆందోళనకు దిగారు. నిన్న ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఓ వ్యక్తికి ప్రమాదం జరగడంతో.. హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. కాలు విరగడంతో సర్జరీ చేయడానికి లక్షన్నర రూపాయలు అవుతుందని, తమతో డబ్బులు కట్టించుకున్నారని బాధితుడి బంధువులు చెబుతున్నారు. తీరా యాక్సిడెంట్ అయిన వ్యక్తి చనిపోయాడంటూ మృతదేహాన్ని అప్పగించారని వాపోయారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయాడని ఆరోపిస్తూ బాధిత బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.