Crime : POCSO న్యాయస్థానం సంచలన తీర్పు..21 ఏండ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు.
చిట్యా మండలం వనిపాకల గ్రామానికి చెందిన దోమల రాములు మూడవ తరగతి చదువుతున్న 8 ఏళ్ల మైనర్ అమ్మాయి ఇంట్లోకి పిబ్రవరి 1 తారీకు 2018 న తాగిన మైకంలో అక్రమంగా ఇంట్లొకి ప్రవేశించి సదరు మైనర్ బాలిక టీవి చూస్తుండగా బెదిరించి, లైంగిక దాడి చేయడం జరిగింది.ఈ ఘటనపై బాధితురాలి తండ్రి 11 ఫిభ్రవరి 2018న చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
SC NO:91/2018
చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిభ్రవరి 11 ,2018 న కేసు కింధి సెక్షన్ల కింధ నమోదు చేయడం జరిగింది. U/s 448,506,376(2)(i) IPC Sec 5(m) r/w 6 of POCSO ACT 2012 8 ఏండ్ల సుదీర్ఘ విచారణ అనంతరం POCSO Incharge న్యాయస్థానం ఇన్చార్జి రోజా రమణి ఈరోజు సెప్టెంబర్ 15 తుది తీర్పు వెల్లడించడం జరిగింది. ఈ కేసు లో నిందితునికి 21 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది.30,000 జరిమానా విదించడం జరిగింది. బాధితురాలికి 10,00,000 కంపెన్సేషన్ ప్రకటించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఐ.వోలుగా కె. భాస్కర్ రెడ్డి, డి సైదులు బాబు,కె.పాండు రంగారెడ్డి,భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన కీలకం గా వ్యవహరించారు.