TOS PUB : బంజారాహిల్స్ పబ్ లో అసాంఘిక కార్యకలాపాలు..!

టాస్ పబ్ లో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న 42 మంది యువతులు, 100 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.;

Update: 2024-10-19 06:04 GMT

TOS PUB: హైదరాబాద్ నగరంలోని ఫ్యాషన్ ప్రాంతం బంజారాహిల్స్ లో 'టాస్' పబ్ పై శుక్రవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఖచ్చితమైన సమాచారంతో టాస్క్ ఫోర్స్ బృందం రంగంలోకి దిగి పబ్ పై చేసిన దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఉద్యోగాల ఆశ చూపి యువతులను ట్రాప్ చేసిన పబ్ నిర్వాహకులు, వారిని అశ్లీల నృత్యాలకు ఉపయోగించుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రతీ వారాంతంలో పబ్ కు వచ్చి కస్టమర్లతో చనువుగా ఉంటూ ఎక్కువ బిల్లులు వేయించాలని యువతులకు ఆదేశాలు ఇచ్చేవారని, టార్గెట్ రీచ్ అయిన వారికి కమీషన్లు ఇచ్చేవారని తెలిసింది. దాడిలో 42 మంది యువతులు, 100 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 10 మంది యువతులు గతంలో ఊర్వశి బార్, ఆఫ్టర్ 9 పబ్ లో ఇదే విధమైన కార్యకలాపాలకు పాల్పడుతూ పట్టుబడినట్లు పోలీసులు గుర్తించారు.

TOS పబ్ నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్, ఆరిఫ్, శ్రావణ్ గౌడ్, డీజే ప్లేయర్ ఆసిఫ్ లపై కేసు నమోదు చేసిన పోలీసులు పబ్ ను సీజ్ చేశారు. రిపీటెడ్ గా ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్న యువతులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, యువతులను రక్షించి వారికి కౌన్సిలింగ్ ఇప్పించనున్నట్లు తెలిపారు. అలాగే, ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించింది.

ప్రముఖ ప్రాంతంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు చోటుచేసుకోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


Tags:    

Similar News