Crime News: పట్టపగలు చోరీ.. మహిళా ప్రొఫెసర్ తలపై కొట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లి..
Crime News: తమిళనాడులోని తిరుచ్చిలో చోరీకి ముందు 53 ఏళ్ల మహిళా ప్రొఫెసర్ తలపై కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు.;
Crime News: తమిళనాడులోని తిరుచ్చిలో చోరీకి ముందు 53 ఏళ్ల మహిళా ప్రొఫెసర్ తలపై కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దాడి దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీతాలక్ష్మి అన్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం పాఠశాల సమీపంలో సీతాలక్ష్మి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు సెంథిల్ కుమార్ చెక్క పలకతో ఆమె తలపై బలంగాకొట్టాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. అనంతరం సెంథిల్ సీతాలక్ష్మిని రోడ్డుపై నుంచి ఫుట్‌పాత్‌పైకి ఈడ్చుకెళ్లాడు. ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్ దొంగిలించి అక్కడి నుంచి తన పరారయ్యాడు. సీతాలక్ష్మి ఫిర్యాదు మేరకు తమిళనాడు పజమనారికి చెందిన సెంథిల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సెంథిల్ కాలికి గాయమైంది. కాలు విరిగినందుకు సెంథిల్ చికిత్స పొందుతుండగా, అతను అపస్మారక స్థితిలో ఉన్న సీతాలక్ష్మిని ఈడ్చుకెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.