Krishna District: ఆర్‌ఎస్‌ఐ నిర్వాకం.. పెళ్లి చేసుకుంటానంటూ వివాహితను మోసం..
Krishna District: ఓ వివాహితను వించించి కటకటాలపాలైన ఆర్‌ఎస్‌ఐ ఉదాంతం కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది.;
Krishna District: ఓ వివాహితను వించించి కటకటాలపాలైన ఆర్‌ఎస్‌ఐ ఉదాంతం కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానంటూ వివాహితను కృష్ణా జిల్లా ఆర్మర్ రిజర్వు విభాగంలో పనిచేస్తున్న ఎస్‌ఐ విశ్వనాథ గణేష్.. కొంతకాలంగా మభ్యపెట్టాడు. వివాహితతో శారీరక సంబంధం పెట్టుకున్న ఆర్‌ఎస్‌ఐ విశ్వనాథ గణేష్.. భర్తకు విడాకులిస్తే పెళ్లిచేసుకుంటానంటూ నమ్మబలికాడు. ఆర్‌ఎస్‌ఐ మాయమాటలు నమ్మిన వివాహిత.. తన భర్తకు విడాకులిచ్చింది. పెళ్లి చేసుకోమని ఆర్‌ఎస్‌ఐని నిలదీయగా మోహం చాటేయడంతో ఉన్నతాధికారులకు కాంఫ్లైట్ ఇచ్చింది. బాధిత మహిళ ఫిర్యాదుతో సీరియస్ అయిన ఉన్నతాధికారులు ఆర్‌ఎస్‌ఐని అరెస్ట్ చేసి జైల్‌కు తరలించారు.