బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పరోటా, వాటర్ బాటిల్ పట్టిం చాయి..! బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్.. సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి దొంగతనానికే వచ్చాడని పోలీసులు చెప్పారు. దాదాపు 72 గంటలపాటు శ్రమించి పోలీసులు మహ్మద్ షరీపుల్ ఇస్లాం షెహజాదు పట్టుకున్నారు. ప్రస్తుతం అతడు పోలీసులు కస్టడీ లో ఉన్నాడు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో మహ్మద్ షరీపుల్ ఇస్లాం షెహజాద్ సైఫ్ ఇంట్లోకి వెళ్లాడని, అయితే అది సెలబ్రిటీ నివాసం అనే విషయం అతడికి తెలియదని పోలీసులు చెబుతు న్నారు. పోలీసులు దాదాపు 600 సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం. దాడి తర్వాత అంధేరి ప్రాంతంలో అతడు ద్విచక్ర వాహనంపై ప్రయాణించినట్లు చెబుతున్నారు. అయితే షరీఫుల్ ను పట్టించింది మాత్రం ఓ యూపీఐ పేమెంట్..! దీనిపై ఒక వ్యక్తి కీలక విష యాన్ని బయటపెట్టాడు. మహ్మద్ తన వద్ద పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడని, యూపీఐ పేమెంట్ చేశాడని చెప్పాడని తెలిపారు. దీనిద్వా రా నిందితుడి నంబర్ తెలుసుకున్న పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసి థాణే లో ఉన్నట్లు గుర్తించారని సమాచారం. పోలీసులను చూసి అతడు అక్కడినుం చి పారిపోవాలని చూడగా.. ఒక్కసారిగా చుట్టుము ట్టి అదుపులోకి తీసుకున్నారు.