CRIME: భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కుతిన్నాడు

పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య;

Update: 2025-05-06 03:30 GMT

"నీ ముక్కు చాలా అందంగా ఉంది, దాన్ని కొరుక్కు తింటా" – ఇది ఒక భర్త తన భార్యతో ప్రేమగా, సరదాగా అన్న మాట. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ మాట ఒక ఉద్రిక్త వాస్తవంగా మారింది. ఈ ఘటన స్థానికులనే కాదు, పోలీసులను కూడా కలిచివేసింది. పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లా శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెర్పారా ప్రాంతంలో నివసిస్తున్న బాపన్ షేక్ – మధు ఖాతూన్ అనే దంపతుల జీవితం అందరికీ ఆదర్శంగా అనిపించేది. బాపన్ తన భార్యను తరచూ పొగడటం, ఆమె అందాన్ని ప్రశంసించటం స్థానికులకు తెలుసు.

    "నీ ముక్కు అందంగా ఉంది.. దాన్ని ఓ రోజు ప్రేమగా కొరుకుతానమ్మా!" అంటూ సరదాగా చెప్పే మాటలను మధు మనసుపెట్టి తీసుకోలేదు. అయితే సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో షేక్ ఇంట్లో ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి. మధు ఖాతూన్‌ బాధతో కేకలు వేస్తుండగా, స్థానికులు అక్కడికి చేరుకుని షాక్ అయ్యారు. ఆమె ముఖంపై తీవ్ర గాయాలు, ముక్కు నుండి రక్తస్రావాన్ని చూసి హతాశులయ్యారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త బాపన్ షేక్ "ఏదో సరదాగా అనేవారు అనుకున్నా… కానీ నిజంగానే నా ముక్కు కొరుక్కు తిన్నాడు" అని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేయగా విచారణ కొనసాగుతోంది. ప్రేమ పేరుతో ఇలా ప్రవర్తించడం అసహజమైన క్రూరత్వంగా భావిస్తున్నారు. మానసిక స్థితిపై కూడా విచారణ చేపట్టినట్టు సమాచారం.




Tags:    

Similar News