సంతకాలు ఫోర్జరీ చేసి స్టాంప్‌లు ఉపయోగించి అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయించి డబ్బులు సొమ్ము చేసుకున్న కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం...తన సంతకం ఫోర్జరీ చేసి అక్రమంగా ఇంటి నంబర్లు కేటాయించారంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం ని* యోజకవర్గ పరిధిలోని అంతర్గాం టీటీఎస్గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఇరుగురాల అనూజ ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరిపారు. కారోబార్ బాణాల మహేశ్, మాజీ సర్పంచ్ కుర్ర వెంకటమ్మ, ఆమె భర్త నూకరాజు, పెరుమాళ్ల శేషుకుమార్ కలిసి 30 మంది వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేసి అనూజ సంతకం ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. అనూజ పాస్వర్డ్ ఉపయోగించి ఆన్లైన్లో నకిలీ ఇంటి నెంబర్లను కేటాయించి రిజిస్ట్రేషన్ చేసినట్టు తేల్చారు. దీంతో నలుగురు నిందితులతో పాటు కుర్ర మాథ్యూ, మద్ది అరుణ్గౌడ్, ఎం.సుమంత్‌పై కేసు నమోదు చేసి జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు రామగుండం సీఐ టి.అజయ్‌బాబు, ఎస్ఐ బి.వెంకటస్వామి తెలిపారు.