Komuram Bheem District : మరో ఖాకీచకపర్వం

Komuram Bheem District : కుమ్రంభీం జిల్లాలో రెబ్బెన ఎస్సై భవానీ సేన్ తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ యువతి ఆరోపించింది.

Update: 2022-07-12 09:33 GMT

Komuram Bheem District : తెలంగాణలో మరో ఖాకీ కీచకపర్వం వెలుగుచూసింది. కుమ్రంభీం జిల్లాలో రెబ్బెన ఎస్సై భవానీ సేన్ తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ యువతి ఆరోపించింది. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది.

కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నానని బాధిత యువతి తెలిపింది. అయితే ఎస్సై భవానీ సేన్.. తనను కానిస్టేబుల్ పరీక్షలో పాస్ చేయిస్తానని చెప్పారని పేర్కొంది. మొదట్లో మంచిగానే ఉన్నారని.. పరీక్ష కోసం బుక్స్ కూడా ఇచ్చారని వెల్లడించింది. తొలుత బాగానే ఉన్న ఎస్సై భవానీ సేన్.. ఆ తర్వాత తన అసలు రూపాన్ని చూపించారని ఆరోపించింది. నెల రోజుల నుంచి తనను లైంగికంగా తీవ్రంగా వేధిస్తున్నాడని చెప్పింది. మొదట్లోనే ఉన్నతాధికారులకు చెబుతామంటే భయమేసిందని బాధిత యువత పేర్కొంది. 

Tags:    

Similar News