విజయవాడలో కూతురుతో కలిసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
విజయవాడలో కూతురుతో కలిసి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూతురుకు ఉరివేసి, తర్వాత తాను ఉరి వేసుకున్న ఘటన... స్థానికంగా విషాదం నింపింది.;
విజయవాడలో కూతురుతో కలిసి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూతురుకు ఉరివేసి, తర్వాత తాను ఉరి వేసుకున్న ఘటన... స్థానికంగా విషాదం నింపింది. కరోనా నేపథ్యంలో ఏడాది క్రితం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిన రవి.... శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. భార్య రవళి కిడ్నీ వ్యాధితో బాధ పడుతూ పుట్టింట్లో ఉంటోంది. కుటుంబ సమస్యలు, భార్య అనారోగ్యమే ఆత్మహత్యకు కారణమని రవి లేఖ రాశాడు. మరణానంతరం తన కిడ్నీని భార్యకు డొనేట్ చేయాలని పేర్కొన్నాడు.