Software Engineer: సాప్ట్‌వేర్ ఇంజనీర్ నిర్వాకం.. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని భార్యని..
Software Engineer: చదువుకున్నోడివై వుండి అమ్మాయి పుట్టడానికి భార్యే కారణం అంటున్నవు.. ఆ మాత్రం తెలియదా..;
Software Engineer: బీటెక్‌లు, ఎంటెక్‌లు చదవగానే సరిపోలేదు.. బుద్ది జ్ఞానం కొంచెం కూడా లేదా.. చదువుకున్నోడివై వుండి అమ్మాయి పుట్టడానికి భార్యే కారణం అంటున్నవు.. ఆ మాత్రం తెలియదా.. విషయం తెలిసిన గ్రామ ప్రజలు సాప్ట్‌వేర్ ఇంజనీర్‌పై విరుచుకుపడుతున్నారు.
వారసుడు పుట్టలేదని కట్టకున్న భార్యను వేధిస్తున్నాడో ప్రబుద్ధుడు. వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని భార్యను పుట్టింటికి పంపేయడంతో.. ఆమె తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు పిల్లలతో కలిసి ధర్నాకు దిగింది. నిజామాబాద్‌లోని ఆర్యనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సందీప్‌కు.. ఆర్మూర్‌కు చెందిన సంధ్యతో ఆరేళ్లక్రితం పెళ్లి జరిగింది.
సాప్ట్‌వేర్ ఇంజనీర్ నిర్వాకం.. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని భార్యని..వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అయితే తనకు మగ పిల్లాడు కావాలంటూ సంధ్యను వేధించడం మొదలు పెట్టిన భర్త.. ఆమెను తీవ్రంగా కొట్టి పుట్టింటికి పంపిచేశాడు. ఈ విషయంలో గతంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయినా సందీప్‌లో మార్పు రాలేదు. పిల్లల పేర్ల మీద ఒక్కొక్కరిపై కోటి రూపాయలు డిపాజిట్ చేయించాలంటూ డిమాండ్ చేయడంతో.. బాధితురాలు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.