Suicide : ప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య

Update: 2024-08-02 11:53 GMT

ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు గురిచేయడంతో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్​ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ పీఎస్ పరిధిలో బాలాజీనగర్​ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలాజీనగర్​ కు చెందిన బాలిక(16).. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 9వ తరగతి చదువుతోంది. ఇటీవల బోనాల పండుగ నేపథ్యంలో ఆమె ఇంటికి వచ్చింది. శివ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో రాత్రి ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News