Jharkhand Teachers : తక్కువ మార్కులు వేసినందుకు టీచర్లనే చితకబాదారు..

Jharkhand Teachers : కావాలనే ఫెయిల్ చేశారంటూ టీచర్లతో పాటు క్లర్క్‌ను చెట్టుకు కట్టేసి కొట్టారు.

Update: 2022-08-31 15:52 GMT

Jharkhand Teachers : టీచర్లు తక్కువ మార్కులు వేస్తే విద్యార్థులు ఏంచేస్తారు..? పట్టుదలతో చదివి మంచి మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఫెయిల్ అయితే కొందరు బాధపడినా పాస్ అయ్యేందుకు పట్టుదలతో చదువుతారు. కానీ.. జార్ఖండ్‌లోని విద్యార్థులు మాత్రం టీచర్లపై ఆగ్రహంతో ఊగిపోయారు. తక్కువ మార్కులు వేశారని.. కావాలనే ఫెయిల్ చేశారంటూ టీచర్లతో పాటు క్లర్క్‌ను చెట్టుకు కట్టేసి కొట్టారు. తమను ఎందుకు ఫెయిల్ చేశారంటూ.. విద్యార్థులు చేసిన వీరంగం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Tags:    

Similar News