Sub-Registrar Bribe : రూ.30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్‌

Update: 2025-05-27 07:30 GMT

రూ. 30 వేల లంచం తీసుకుంటుండగా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఖమ్మం జిల్లా తల్లంపాడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతుకు సంబంధించి రెండెకరాల వ్యవసాయభూమిని వారి తల్లిదండ్రుల నుంచి గిఫ్టెడ్ చేసేందుకు.. రైతును సబ్ రిజిస్ట్రార్ అరుణ రూ.50 వేలను స్టాంప్వెండర్ ద్వారా లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధిత రైతు ఏసీబీ అధికారులకు ఆశ్రయించగా..సబ్ రిజిస్ట్రార్‌ ఆదేశించడంతో డాక్యుమెంటరీ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్‌ కార్యాలయంలో బాధితుడు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ అరుణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫీస్ లోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించిన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News