ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు లో దొంగలు హల్చల్ చేశారు...పట్టణంలోని గమల్లపాలెం,అశోక్ నగర్ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు... గమల్లపాలెం చెందిన పరుచూరి శివయ్య అనే వ్యక్తి ఇంట్లో రాత్రి సమయంలో చొరబడి సుమారు 25 లక్షలు విలువచేసే 30 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు...ఆగస్టు నెలలో ఉన్న కుమార్తె వివాహం కోసం దాచి ఉంచిన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్ళారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు... రాత్రి సమయంలో వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లడంతో తెల్లవారుజామున చోరీకి పాల్పడినట్లు తెలిపారు... అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన శేషయ్య అనే వ్యక్తి ఇంట్లో స్వల్పంగా బంగారం చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు...సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ద్వారా వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు.