Dharmasamudram: జగిత్యాలలో విషాదం.. ముగ్గురు యువతులు చెరువులో దూకి ..
Dharmasamudram: జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో విషాదం నెలకొంది.;
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో విషాదం నెలకొంది. గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం దగ్గరున్న ధర్మసముద్రం చెరువులో పడి ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఇద్దరికి వివాహం కాగా... ఇంకో యువతి ఇంటర్ చదువుతోంది. మృతుల్లో గంగాజల, మల్లిక దేహాలు లభించగా... మరో యువతి మృతదేహం కోసం గాలింపు జరుపుతున్నారు. ఆత్యహత్యకు కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదని జగిత్యాల పోలీసులు తెలిపారు.