మెదక్ జిల్లాలో నర్సాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణ శివారులోని క్లాసిక్ గార్డెన్ వద్ద బీవీఆర్‌ఐటీ కళాశాలకు చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్లు బస్సుల్లో ఇరుక్కుపోవడంతో బయటకు తీయడానికి శ్రమించాల్సి వచ్చింది. వారిలో నాగరాజు (50) మృతిచెందారు. 20 మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు తరలించారు. ఘటనాస్థలానికి నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సై లింగం చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంతో నర్సాపూర్- సంగారెడ్డి మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు, కళాశాల సిబ్బంది చర్యలు చేపట్టారు.