బాలుడిని హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Update: 2023-07-11 05:45 GMT

ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్న పిల్లల హత్యలు తల్లిదండ్రులను భయాందోలనకు గురి చేస్తున్నాయి. చిన్నారులను బడికి పంపాలంటే ఏ క్షణాన ఏమవుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. మొన్న ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం సురిగుడి గ్రామంలో బాలుడి మిస్సింగ్ కేసు ఇంకా చేధించకముందే ఇవాళ మరో విద్యార్ధి దారుణ హత్యకు గురయ్యాడు. పులిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమశాఖ వసతిగృహంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి గోగుల అఖిల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి చంపేశారు.ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న అర్ధరాత్రి 12 గంటల తర్వాత విద్యార్థి హత్యకు గురైనట్లు తెలుస్తోంది. గోగుల అఖిల్‌ బుట్టాయగూడెం మండలం ఉర్రింక గ్రామానికి చెందిన విద్యార్ధి. అఖిల్‌ను ఎవరు ఎందుకు హత్య చేశారనే కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే వసతిగృహ సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తమ కుమారుడు చనిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బుట్టాయగూడెం పోలీసులు. వరుస ఘటనలతో ఆ ప్రాంతంలోని  ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

Tags:    

Similar News