తాము అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించలేదని కర్కసంగా దాడి చేసి కొట్టి చిత్రహింసలు పెట్టినా ఘటనకు సంబంధించిన ఓ వీడియో ధర్మవరం పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్మవరం పట్టణంలో లక్ష్మీ చెన్నకేశవపురానికి చెందిన ఓ ముఠా ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి అధిక వడ్డీలకు డబ్బులు ఇవ్వడం తిరిగి చెల్లించకపోతే కర్కస్యంగా ఇష్టానుసారంగా వారిపై దాడికి దిగడం ఓ పరిపాటిగా మారుతుంది. ఇప్పటికే గతంలో వీరిపై అనేకసార్లు ఇటువంటి ఫిర్యాదులు రావడంతో వారిపై పోలీసులు వారిపై పదేపదే పలుమార్లు కేసులు నమోదు చేసి రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు. అయినప్పటికీ వారిలో ఏమాత్రం మార్పు రాకపోగా తాము అప్పు ఇచ్చిన వారిని పదేపదే వేదించడం వారి ఇంటికి వెళ్లి దాడులు చేయడం క్రమంగా జరుగుతూనే ఉంది. గత రెండు రోజుల క్రితం ఇదే పరిణామం ధర్మవరం పట్టణంలో జరగడంతో బాధితులు ధర్మవరం రెండవ పట్టణ పోలీసులను ఆశ్రయించారు పూర్తి వివరాలను నమోదు చేసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. తొందర్లోనే వారిని అరెస్టు చేస్తున్నట్లు ఆయన తెలిపారు