అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో ఐదేళ్ల చిన్నారిని 13 ఏళ్ల బాలుడు (8వ తరగతి) అత్యాచారం చేశాడు. శనివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి అత్యాచారానికి పాల్పడ్డట్లు బాలుడు పోలీసులతో చెప్పినట్లు సమాచారం.
అయితే మరోవైపు బాధిత కుటుంబాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పరామర్శించారు. బాధితులను బెదిరిస్తున్నారని తమకు తెలిసిందని, బాధితులను బెదిరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.