బైక్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో వాచ్‌మెన్ మృతి చెందాడు. వేగంగా దూసుకువచ్చి రెడిమిక్స్ లారీ బైక్ ను ఢీ కొట్టడంతో..వాచ్‌మెన్ లారీ టైర్లకింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, అతని భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌కు చెందిన రాకేశ్‌రాయ్(33) కుటుంబ సభ్యులతో కలిసి గతకొంత కాలం క్రితం నగరానికి వలసవచ్చారు. ఓ అపార్టుమెంట్ భవనం వద్ద రాకేశ్‌రాయ్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం రాకేశ్ రాయ్ దంపతులు ఇద్దరు బైక్‌పై గాజుల రామారం సర్కిల్ పరిధిలోని షాపూర్ నగర్ మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో హెచ్‌పీ పెట్రోల్ బంకు మూలమలుపు వద్ద కాంక్రీట్ రెడిమిక్స్‌లారీ బలంగా ఢీ కొట్దింది. ఈ ప్రమాదంలో రాకేశ్‌రాయ్ చనిపోగా అతడి భార్యకు గాయాలయ్యాయి. మృతుడి భార్య ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.