పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య

పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది వామన్‌ రావు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. రామగిరి మండలం కలవచర్ల ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.

Update: 2021-02-17 11:28 GMT

పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది వామన్‌ రావు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. రామగిరి మండలం కలవచర్ల ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మంథని నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు న్యాయవాది వామన్ రావు కారును వెంబడించారు. కారులోనే న్యాయవాది వామన్ రావును విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు.. అడ్డువచ్చిన ఆయన భార్య నాగమణిని కూడా దుండగులు హతమార్చారు. కలవచర్ల పెట్రోల్ బంకు ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది.

దాడి తర్వాత న్యాయవాది వామన్‌రావు నడిరోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్నారు. తనపై దాడి చేసింది కుంటా శ్రీనివాస్ అని వామన్ రావు చనిపోయే ముందు చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ దంపతులిద్దరినీ 108 వాహనంలో పెద్దపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందారు. న్యాయవాది వామన్ రావు స్వగ్రామం రామగిరి మండలం గుంజపడుగు. ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News