వరంగల్లో 8 రోజులుగా మృత్యువుతో పోరాడి వైద్యుడు సుమంత్ రెడ్డి నేడు చనిపోయారు. ఫిబ్రవరి 20న ఇతనిపై భార్య మరియా ప్రియుడితో దాడి చేయించింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా శామ్యూల్ తో మరియాకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో సుమంత్ కాపురాన్ని వరంగల్ కు మార్చారు. భర్త అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్లాన్ వేయగా వీరికి కానిస్టేబుల్ రాజ్ హెల్ప్ చేశాడు. ప్రస్తుతం ముగ్గురూ అరెస్ట్ అయ్యారు.