భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆమె నోటికి ఫెవిక్విక్ వేసి అతికించాడో భర్త. ఈ ఘటన దొడ్డబళ్లాపురా జిల్లాలోని నెమమంగల తాలూకా హారోక్యాతనహళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్ధలింగయ్య, భార్య మంజుల దంపతులు ఉంటున్నారు. ఇద్దరికీ పదేండ్ల క్రితం వివాహంజరిగింది. మంజుల గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనికి వెళ్తంది. సిద్ధలింగయ్య ఆయుర్వేద ఔషధ కంపెనీలో పని చేస్తున్నాడు. భార్యపై అనుమానంతో అతడు తరచూ గొడవపడేవాడు. మొన్న రాత్రి అతని పైశాచికం శృతిమించింది. ఆమె పెదవులపై ఫెవిక్విక్ వేసి అతికించి పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మాదనాయకనహళ్లి పోలీసులు బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు గమ్ ను తొలగించారు. పోలీసులు సైకో భర్తని అరెస్టు చేశారు.