ప్రియుడి కోసం భర్తనే హత్య చేసి.. భోజనంలో నిద్రమాత్రలు కలిపి..
భార్య అనే పదానికే మచ్చ తెచ్చింది ఓ ఇల్లాలు. దైవ సాక్షిగా మెడలో మూడు ముళ్లూ వేసి.. ఏడడుగులు నడిచిన భర్తనే హత్య చేసింది ఆమె. కేవలం ప్రియుడి మోజులో పడి భర్త పాలిట యమపాతంగా మారింది;
భార్య అనే పదానికే మచ్చ తెచ్చింది ఓ ఇల్లాలు. దైవ సాక్షిగా మెడలో మూడు ముళ్లూ వేసి.. ఏడడుగులు నడిచిన భర్తనే హత్య చేసింది ఆమె. కేవలం ప్రియుడి మోజులో పడి భర్త పాలిట యమపాతంగా మారింది. కనీస కనికరం కూడా లేకుండా... ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఆలస్యంగా బయటపడ్డా ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో చోటు చేసుకుంది.
కదిరిలోని వీవర్స్ కాలనీలో నాగభూషనం, ఈశ్వరమ్మ నివాసముంటున్నారు. అయితే ఇటీవల నాగభూషణం భార్య ఈశ్వరమ్మకు ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేసే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా... అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే ఈ వ్యవహారం మొత్తం భర్త నాగభూషణంకు తెలిసింది. ప్రవర్తన మార్చుకోవాలని ఆమెను పలుసార్లు నాగభూషణం మందలించాడు. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని భావించిన ఈశ్వరమ్మ.. ప్రియుడిని ఇంటికి పిలుపించుకుని పక్కా ప్లాన్‌తో భర్త నాగభూషణంను దారుణం హత్య చేసింది. భోజనంలో నిద్ర మాత్రలు కలిపి మత్తులోకి వెళ్లిన తర్వాత రోకలితో కొట్టి చంపింది.
ఈ మొత్తం ఉదాంతం బయటపడకుండా సొంత బాబాయ్‌తో రెండు లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని.. గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయంలో భర్త మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి.. ముళ్ల పొదల్లో పూడ్చి పెట్టింది. అయితే నాగభూషణం కోసం అడిగిన బంధువులకు చెన్నై వెళ్లారని అబద్ధం చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశంతో మొత్తం బాగోతం బయటపడింది. ఈ కేసులో నలుగురు నిందితులను కదిరి పోలీసుల అరెస్ట్ చేశారు.
ఇదంతా ఈశ్వరమ్మ ప్రియుడి కోసం చేసినప్పటికీ అతని పేరును పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయలేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో విచారణ తర్వాత ఈశ్వరమ్మ ప్రియుడి పాత్ర ఏమేరకు ఉందో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.