Suicide : అదనపు కట్నం వేధింపులతో బావిలో దూకిన మహిళ

Update: 2024-05-07 06:17 GMT

అదనపు కట్నం వేధింపు లతో పాటు, భర్తకు మరో మహిళతో సంబంధం ఉందన్న విషయం తెలియడంతో మనస్తాపా నికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో సోమవారం జరిగింది. యాదగిరిగుట్ట మున్సి పాలిటీ పరిధిలోని యాదగిరిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బూడిద యాదయ్య, దేవమ్మల కూతురు నాగమణి (25)కి జనగాం జిల్లా నాగారం గ్రామానికి చెందిన గడిపె ప్రవీణ్తో 2020 మార్చి 18న వివాహం జరిగింది.

ఏడాది పాటు సవ్యంగానే ఉన్న ప్రవీణ్ అదనపు కట్నం కోసం నాగమణిని వేధించేవాడు. దీంతో నాగమణి తల్లిదండ్రులు పలుమార్లు పెద్ద మనుషులను సమక్షంలో పంచాయితీ పెట్టినా వేధింపులు ఆగలేదు. దీంతో నాగమణి మూడు రోజుల క్రితం యాదగిరిపల్లిలోని తల్లిగారింటికి వచ్చింది. అదనపు కట్నం వేధింపుల తో పాటు ప్రవీణ్ కు మరో మహిళతో సంబంధం ఉన్నట్లు తెలియడంతో మనస్తాపానికి గురైన నాగమణి సోమవారం ఇంటి పక్కనే ఉన్న బావిలో దూకింది.

విషయం తెలియడంతో గ్రామస్తులంతా బావి వైపు పరుగెత్తారు. ఆ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ ప్రభాకర్, డ్రైవర్ శంకర్ వెంటనే బావి వద్దకు వచ్చారు. బావిలోకి దూకి నాగమణిని బయటకు తీశారు. అప్పటికే స్పృహ కోల్పోవడంతో సీపీఆర్ చేసిన అనంతరం భువనగిరి ఏరియా హాస్పిటల్కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది.నాగమణితండ్రి యాదయ్య ఫిర్యా దుతో ఆమె భర్త ప్రవీణ్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేశ్ చెప్పారు.

Tags:    

Similar News