తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 64,170 మంది భక్తులు దర్శించుకోగా 26,821 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు సమకూరింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ప్రతి నెలా ఆన్‌లైన్‌లో దర్శన టోకెన్లు, ఆర్జిత సేవ టోకెన్లు, వసతి గదుల్ని విడుదల చేస్తు్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్జిత సేవల టోకెన్లను విడుదల చేయగా.. రూ.300 దర్శన టికెట్లు, వసతి గదుల్ని విడుదల చేయనున్నారు. ఇవాళ శ్రీవాణి ట్రస్టు టోకెన్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను ఇవాళ టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.