Gold Missing in Kedarnath : కేదార్‌నాథ్‌లో 228 కిలోల బంగారం మాయం

Update: 2024-07-17 09:21 GMT

కేదార్ నాథ్ 228 కిలోల బంగారం కనిపించడం లేదని జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి వెల్లడించారు. భారీ స్థాయిలో బంగారం కుంభకోణం జరిగిందని చెప్పారు. దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనికి బాధ్యులైన వారి వివరాలు బయటకు తీసుకురావాలి. ఇప్పటి వరకు ఈ కేసులో దర్యాప్తు జరగలేదని చెప్పారు.

ఈ కుంభకోణాలకు పాల్పడి ఇప్పుడు ఢిల్లీలో కేదార్నాథ్ ఆలయాన్ని కడుతామని అనడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు స్వామి. ఇటీవల ఢిల్లీలో కేథార్నాథ్ ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ అవిముక్తేశ్వరానంద ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఆలయ నిర్మాణంపై ఉత్తరాఖండ్ యాత్రికులు, పూజారులు, సాధువులు విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో నిర్మిస్తున్న ఆలయం కేదార్నాథ్ ఆలయానికి ప్రతిరూపం మాత్రమే అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వాదించారు.

ఢిల్లీలో ఈ ఆలయాన్ని సిద్ధం చేస్తున్న శ్రీ కేదార్నాథ్ ధామ్ ట్రస్ట్ ఈ విషయంపై మాట్లాడుతూ.. బురారీలో కేదార్నాథ్ ఆలయాన్ని మాత్రమే నిర్మిస్తున్నామని ఇది ధామ్ క్షేత్రం కాదని చెప్పారు. కేదార్నాథ్ ధామ్ తలుపులు 6 నెలల పాటు మూసి ఉంటాయని ఆలయాన్ని సిద్ధం చేసే శ్రీ కేదార్నాథ్ ధామ్ ట్రస్ట్, బురారీ చెబుతోంది. అందుకే ఆ ఆరు నెలల్లో బాబా కేదార్ నాథ్ దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు లభిస్తుందని తెలిపింది.

Tags:    

Similar News