ఈ సీజన్ లో శబరి మల అయ్య ప్ప స్వామిని 53 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ట్రావెన్ కోర్ బోర్డు ప్రక టించింది. ఈ ఏడాదికి సంబంధించిన మం డలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు సోమవారం వైభవంగా ముగిశాయి. దీంతో ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవ స్థానం బోర్డు ప్రకటించింది. పందళ రాజ కుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేశామని తెలిపింది. రెండు నెలల పాటు జరిగిన మండల, మక రువిళక్కు వార్షిక పూజల కోసం నవంబర్ 15వ తేదీన ఆలయాన్ని తెరిచారు అధికారులు. మండల పూజలు అయిపోయిన తర్వాత అంటే డిసెంబర్ 26వ తేదీన ఆలయాన్ని మూసివేశారు. ఇలా 41 రోజుల పాటు సాగిన పూజా కార్యక్ర మాల్లో లక్షలాది మంది భక్తులు పా ల్గొన్నారు. నాలుగు రోజులు అయిన తర్వాత అంటే డిసెంబర్ 30వ తేదీ రోజు సాయంత్రం 4 గంటలకు మళ్లీ ఆలయాన్ని తెరిచారు. ఈ మకరు విళక్కు సీజన్ పూర్తయ్యే వరకూ.. ప్రతి రోజు తెల్లవారుజాము 3.30 గంటలకు ఆలయం తెరవగా 11 గంటల వరకు ప్రతి రోజూ స్వామి వారికి నెయ్యభిషేకం చేశారు. మధ్యాహ్నం కలభ అభిషేకం అంటే పాలు, తేనె, పెరుగు, నెయ్యి, పంచదార, చందనం, విభూతి సహా ఎనిమిది వస్తువులతో స్వామికి అభిషేకం నిర్వహించారు.