తిరుమలలో టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనం కోసం 8 గంటలు పడుతోంది. 4 కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,764 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 23,504 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.14కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. 4.8లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ రిలీజ్ చేయగా 20 నిమిషాల్లోనే బుక్ అయ్యాయి.
అంతేకాదు మే నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి అంగ ప్రదక్షణ టోకెన్లు విడుదల చేసిన రెండు నిమిషాల వ్యవధిలోనే భక్తులు కొనుగోలు చేశారు. అంతేకాదు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టోకెన్లను సైతం కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే భక్తులు బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీవాణి దర్శన టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.. టీటీడీ రోజుకి 500 చొప్పున 15 వేల టిక్కెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. శ్రీవాణి టిక్కెట్ల విక్రయాలు పూర్తయితే టీటీడీ ఖజానాకు రూ.15.75 కోట్ల ఆదాయం వస్తుంది.