TTD : కొలువుదీరిన టీటీడీ కొత్త పాలకమండలి
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి కొలువుదీరింది. 25 మందితో కొత్త పాలకమండలిని ప్రభుత్వం నియమించింది.;
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి కొలువుదీరింది. 25 మందితో కొత్త పాలకమండలిని ప్రభుత్వం నియమించింది.ఇందులో జూపల్లి రామేశ్వర్‌రావు, హెటిలో పార్థసారథి రెడ్డి, మారంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ముంబయికి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ రెండోసారి సభ్యత్వం దక్కించుకున్నారు. ఇక కొత్తగా వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, ఎంఎస్‌ఎన్ లాబ్స్ జీవన్ రెడ్డి, కోల్‌కతాకు చెందిన సౌరబ్, డాక్టర్ కేతన్ దేశాయ్ కర్ణాటకకు చెందిన శశిధర్, శంకర్ ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్, తమిళనాడు నుంచి ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య, కర్ణాటక నుంచి ఎమ్మెల్యే విశ్వనాథ్ రెడ్డి... టీటీడీ పాలకమండలిలో చోటు దక్కించుకున్నారు.