కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకి విద్యా బాలన్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల విద్యాబాలన్ మీడియాతో మాట్లాడుతూ…. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తిరుమలలో సినిమాల గురించి మాట్లాడనని సున్నితంగా తిరస్కరించారు.