కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ మినిస్టర్ అట్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రముఖ సినీ కథానాయకి ఐశ్వర్య రాజేష్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇక ఆలయం వెలుపల ఐశ్వర్య రాజేష్ ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఆమె అందరితో సరదాగా సెల్ఫీలు వచ్చారు.