TTD : శ్రీవారి భక్తులకు అలెర్ట్... అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా భక్తులు బారులు కడుతుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. 3 నెలల ముందుగానే దర్శనానికి సంబంధించిన టికెట్లు జారీ చేస్తూ ..భక్తుల సంఖ్య ను అంచనా వేస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్లు వివరాల పై కీలక అప్డేట్ ఇచ్చింది టీటీడీ .
ఇప్పటికే.. అక్టోబర్ కు సంబంధించి కళ్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, ఊంజల్ సేవ టికెట్లు, అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేసేందుకు టీటీడీ సిద్ధమైంది. కాగా ఈరోజు ఉదయం 10 గంటలకు అక్టోబర్ 2025 నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్ లో విడుదల చేసింది టీటీడీ. అలాగే వసతి గదుల బుకింగ్స్ కూడా ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్నాయి. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ https://www.tirumala.org/ లో వీటిని బుక్ చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. వర్షాకాలం లో కూడా తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది.