తిరుమల శ్రీవారిని ఏపీ రెవిన్యూ శాఖామంత్రి అనగని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ... శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్టు తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని... మొన్న అన్నదాత సుఖీభవ ఇవాళ చేనేత కార్మికులకు..అలాగే నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంటు ఇస్తున్నట్టు...రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు.