AP Minister : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి కందుల దుర్గేష్

Update: 2025-07-29 12:00 GMT

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన ఆలయానికి చేరుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు మంత్రి కందుల దుర్గేష్‌కు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు పట్టువస్త్రాలు, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించారు. సింగపూర్ లో ఏపీ బ్రాండ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్న సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావాలని శ్రీవారిని కోరుకున్నానని తెలిపారు. 

Tags:    

Similar News