AP Minister Savitha : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి సవిత

Update: 2025-03-04 10:00 GMT

తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి సవిత శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీఎం చంద్రబాబునాయుడికి శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని శ్రీవారిని కోరుకోవడం జరిగిందన్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ... శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు అన్న ప్రసాద వితరణ చాలా బాగున్నాయని తెలిపారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్నటి వరకూ సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ నేడు పెరిగింది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్లు బయట వరకూ విస్తరించాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు సత్వరం దర్శనం పూర్తయ్యేలా వేగంగా దర్శనాలు చేయిస్తున్నారు.

Tags:    

Similar News