AP Minister Subhash : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి సుభాష్
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్. బుధవారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి సుభాష్. దర్శన అనంతరం రంగనాయకుల మండలంలో మంత్రికి వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో సామాన్య భక్తుల కోసం సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. లడ్డూ, ప్రసాదాల నాణ్యతపై ఎప్పటికీ అప్పుడు అభిప్రాయ సేకరణ టీటీడీ చేపడుతోందని భక్తులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
శ్రీశైలం
మరోవైపు నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉ.9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు అంకురార్పణ పడనుంది. వేడుకల్లో భాగంగా ఆర్జిత సేవలను రద్దు చేశారు. సాధారణ భక్తులకు స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనం ఉంటుంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.