మహా శివరాత్రి: ఉపవాసం ఎవరు ఉండొద్దంటే?
పరమశివుడికి ఇష్టమైన మహా శివరాత్రి రోజున భక్తులు అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణ చేస్తారు. అయితే ఇవాళ అనారోగ్యం, నీరసంతో ఉన్నవారు, డయోబెటిస్ వ్యాధిగ్రస్థులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలు చేయకపోవడమే ఉత్తమమని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి వారు మహాశివరాత్రి రోజున శివనామ స్మరణ, ప్రవచనాలు వింటూ ఉండొచ్చని సూచిస్తున్నారు.
శివరాత్రి రోజు మీ లైఫ్‌స్టైల్‌కు తగిన ఉపవాసాన్ని ఎంచుకోవాలి.
*నిర్జల ఉపవాసం: చాలా కఠినంగా ఉంటుంది. ఎటువంటి ఆహారం, లిక్విడ్ తీసుకోరు. షుగర్, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు, గర్భిణులు ఇది చేయవద్దు.
*ఫలాహార ఉపవాసం: అరటి, యాపిల్, దానిమ్మ, జామ, పాలు, మజ్జిగ, పళ్లరసాలు, డ్రైఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు.
*ఏక భుక్త వ్రతం: ఉదయం భోజనం చేసి మిగతా రోజంతా పండ్లు తీసుకోవచ్చు.
చిలగడదుంప లేనిదే శివరాత్రి గడవదు. ఈ రోజు ప్రతి ఇంట్లో ఈ దుంప కనిపిస్తుంది. ఉపవాసం ఉన్నవారు వీటిని ఉడకబెట్టుకొని తింటారు. ఇందులో ఫైబర్, పొటాషియం, ఐరన్, స్టార్చ్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే కంటిచూపు మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కడుపు నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుంది. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. శివరాత్రి నాడే కాకుండా ప్రతిరోజు తీసుకుంటే ఎంతో మేలని వైద్యులు చెబుతారు.