ఏప్రిల్‌కు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఇవాళ ఉదయం 10గంటలకు రిలీజ్ చేయనుంది. ఈ సేవల లక్కీడిప్ కోసం ఈ నెల 20న ఉ.10గంటల వరకు నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ నెల 23న ఉ.10 గంటలకు అంగప్రదక్షిణం, ఉ.11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, మ.3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లు జారీ చేయనుంది. 24న ఉ.10 గంటలకు రూ.300 కోటా, మ.3 గంటలకు వసతి గృహ టికెట్లు ఇవ్వనుంది.
మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని దశాశ్వమేధ ఘాట్‌లో తిరుమల శ్రీవారికి గంగా హారతిని అర్చకులు సమర్పించారు. శ్రీవారి నమూనా ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోఛ్చారణల నడుమ శ్రీనివాసుడి ప్రతిమను ఘాట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, అధికారులు పాల్గొన్నారు.