Telugu Horoscope Today : ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు... ఆకస్మిక ప్రయాణాలు..!
Telugu Horoscope Today : పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. నూతన పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.;
Telugu Horoscope Today : శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువుకార్తీక మాసం, తిథి బ.పాడ్యమి ప.2.55 వరకు తదుపరి విదియ, నక్షత్రం రోహిణి పూర్తి (24గంటలు) వర్జ్యం రా.9.23 నుండి 11.11 వరకు, దుర్ముహూర్తం ఉ.6.10 నుండి 7.41 వరకు, అమృతఘడియలు... రా.2.41 నుండి 4.28 వరకు.. సూర్యోదయం : 6.11, సూర్యాస్తమయం : 5.20, రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30, యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు
రాశిఫలాలు:
మేషం : పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. నూతన పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృషభం : ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. పనుల్లో ప్రతిబంధకాలు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మిథునం : వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కర్కాటకం : శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
సింహం : దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కన్య : రుణాలు చేయాల్సిన పరిస్థితి. వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
తుల : నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆకస్మిక ధనలాభం. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
వృశ్చికం : దూరపు బంధువుల కలయిక. కార్యసిద్ధి. నూతన ఉద్యోగయోగం. పరపతి కలిగిన వారితో పరిచయాలు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
ధనుస్సు : వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో సత్సంబంధాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
మకరం : కొన్ని వివాదాలు నెలకొని పరీక్షగా మారతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
కుంభం : పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన పరిచయాలు. ధన, వస్తులాభాలు. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
మీనం : పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. కష్టించినా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.