అయోధ్యలో బాలరాముడికి రూ.5,500 కోట్ల భారీ విరాళం అందింది. గత 10 నెలల్లో మొత్తం రూ.11 కోట్ల విదేశీ విరాళాలు వచ్చాయి. గత మూడేళ్లలో, అయోధ్య రామ మందిరానికి బంగారం, వెండితో సహా రూ.2,000 కోట్లకు పైగా విరాళాలు అందినట్లు సమాచారం. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో చారిత్రాత్మక బాలరాముడి మందిరం నిర్మాణానికి 2020లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. 2021 లో ఆలయ నిర్మాణానికి నిధుల ప్రచారంలో రూ.9,500 కోట్లు వచ్చాయి. అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి విరాళాలు అందుకుంది.
అంతర్జా తీయ విరాళాల నుండి 10,000 మందికి పైగా రశీదులను అందించింది. ఈ ఏడాది జన వరిలో భారీ ఆలయాన్ని మోడీ చేతుల మీదుగా ప్రారంభించారు. శంకుస్థాపన కార్య క్రమం నాటి నుండి భక్తులు రామ్ లల్లాకు విరాళాలు అందజేస్తూ వస్తున్నారు. అయితే, ఆలయ ప్రారంభ సమయంలో, తరువాత విరాళాల వేగంతోపాటు మొత్తం కూడా పెరిగింది. ఆలయానికి రోజూ లక్షల్లో విరాళాలు వస్తున్నాయి.
అయోధ్య రామమందిర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆన్లైన్ చెల్లింపు వ్యవస్థ ద్వారా భక్తులు డబ్బును విరాళంగా అందిస్తున్నారు. అలాగే బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలు కూడా బాలరాముడికి కానుకలుగా అందుతున్నాయి. డిపాజిట్లతో పాటు చెక్కు, డ్రాఫ్టులు, నగదు విరాళా లతో పాటు అన్ని రూపాల్లో విరాళాలను ట్రస్ట్ స్వీకరిస్తుందని రామమందిర్ ట్రస్ట్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా తెలిపారు.