రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఉత్తరాన బంగియా సమితి ఆధ్వర్యంలో దుర్గా పూజా వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత 7 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది దుర్గా పూజా వేడుకలు బెంగాలీ కమ్యూనిటీకి చెందిని వారు నిర్వహిస్తున్నారు. ముందుగా 5 మంది నుంచి ప్రారంభించిన ఈ ఉత్సవాల్లో ఇప్పుడు సుమారు 10 వేల మంది సభ్యులు చేరారని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడి వేడుకల్లో పాల్గొంటే కలకత్తాలోని అమ్మవారిని మొక్కులు చెల్లించుకున్నట్లు భావిస్తామన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల తో దాండియా ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.